తెలంగాణలో కొత్తగా 1500 కేసులు.. ఎనిమిది మంది మృతి

ఆదివారం, 26 జులై 2020 (13:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకి సగటున 1500 కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం 1,593 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 54,059కి చేరింది. అంతేగాకుండా ఎనిమిది కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 463కి చేరింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 12,264 యాక్టీవ్ కరోనా వైరస్ కేసులున్నాయి. ఆదివారం 998 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 41,332కి పెరిగింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 15,654 నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,53,425 నమూనాలను పరీక్షించారు.
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో 640, రంగారెడ్డి జిల్లాలో 171, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 131, మేడ్చల్‌ జిల్లాలో 91, కరీంనగర్‌ జిల్లాలో 51, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 46, ఆదిలాబాద్‌ జిల్లాలో 14, భద్రాద్రిలో 17, జగిత్యాలలో 2, జనగామలో 21, భూపాలపల్లిలో 3, జోగులాంబ గద్వాలలో 5, కామారెడ్డిలో 36, ఖమ్మంలో 18, మహబూబ్‌నగర్‌లో 38, మహబుబాబాద్‌లో 29, మంచిర్యాలలో 27 కేసులు నమోదైనాయి. 
 
అలాగే మెదక్‌లో 21, ములుగులో 12, నల్లగొండలో 6, నారాయణపేటలో 7, నిర్మల్‌లో 1, నిజామాబాద్‌లో 32, పెద్దపల్లిలో 16, సిరిసిల్లలో 27, సంగారెడ్డిలో 61, సిద్దిపేటలో 5, సూర్యాపేటలో 22, వికారాబాద్‌లో 9, వనపర్తిలో 1, వరంగల్‌ రూరల్‌లో 21, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు