తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన మామిడాల రాజా వెంకటరమణ (54) మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ భార్య, కుమారుడితో కలిసి అక్కడే ఉంటున్నారు.
అయితే, గత ఐదు రోజులుగా ఆయన జ్వరం, జలుబుతో బాధపడుతూ వచ్చాడు. దీంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నారు. పరీక్షించిన వైద్యుడు ఎందుకైనా మంచిదని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు.
దీంతో ఆయన భయపడిపోయారు. తనకు ఖచ్చితంగా కరోనా సోకివుంటుందని అనుమానించిన వెంకటరమణ.. అదే రోజు సాయంత్రం వరకు విధులు నిర్వర్తించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా కరీంనగర్‌లో తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.