కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను ఓకే చెప్పిన డీజీసీఐ

సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:45 IST)
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే 140 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోస్‌లను వినియోగించారు. ఇపుడు పలువురికి బూస్టర్ డోస్‌లు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో కరోనా వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. 
 
రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) పచ్చజెండా ఊపించింది. ఇది సింగిల్ డోస్ కరోనా. మన దేశంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 8 వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లు కావడం గమనార్హం. తాజాగా స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌తో దేశంలో అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ల సంఖ్య 9కి చేరింది. 
 
అలాగే, సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. ఇదిలావుంటే, కొత్త వ్యాక్సిన్ చేరికతో దేశఁలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత బలోపేతం అవుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ఓ ప్రకటన చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు