టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. తొలి డోసు టీకా వేయించుకున్నట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. టీకాను చాలా సులువుగా, నొప్పి లేకుండా తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 24,882 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,33,728కు చేరింది.