బూస్టర్ డోస్‌పై కేంద్రం ఫోకస్.. రెండో డోస్ తీసుకున్నాక..?

మంగళవారం, 22 మార్చి 2022 (13:37 IST)
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే బూస్టర్ డోస్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే త్వరలో 18 ఏళ్ల పైబడిన భారత పౌరులందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తుంది. 
 
ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ అందుబాటులో ఉంది. రెండో డోస్ తీసుకున్నాక 9 నెలలు లేదా 39 వారాల తరువాత బూస్టర్ డోస్‌కు కేంద్రం అనుమతి ఇస్తుంది.
 
మార్చి 20 ఆదివారం 17 వందలకుపైగా కేసులు నమోదు కాగా, సోమవారం వెయ్యి 549 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4 కోట్ల 30లక్షల 9వేల 390కి చేరాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు