ఇండియా కరోనా అప్డేట్: 40వేలు దాటిన కరోనా కేసులు

శనివారం, 20 మార్చి 2021 (17:37 IST)
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. రోజువారి పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  తాజాగా ఇవాళ కేంద్రం కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కి చేరింది.  
 
ఇందులో 1,11,07,332 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,88,394 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 188 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,59,558కి చేరింది.
 
గడిచిన 24 గంటల్లో ఇండియాలో 23,653 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం ఇప్పటివరకు 4,20,63,392 మందికి వ్యాక్సిన్‌ను అందించినట్టు కేంద్రం తన బులెటిన్ లో పేర్కొన్నది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు