మంగళవారం ఒక్కరోజే కేరళలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఒక్క కన్నూర్‌లోనే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. పాలక్కడ్‌లో నాలుగు, కాసర్‌గోడ్‌లో మూడు, మలప్పురం, కొల్లాంలో ఒక్కో కేసు నమోదైంది.
మరోవైపు, కేరళలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టుండి పెరగడానికి సోమవారం ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపే కారణంగా తెలుస్తోంది. లాక్‌డౌన్ సడలించడంతో ఆయా ప్రాంతాల్లో జన సంచారం పెరిగింది. క్షౌరశాలలు, రెస్టారెంట్లు, బుక్ షాపులు, సరి-బేసి విధానంలో ప్రైవేట్ వాహనాలకు అనుమతినివ్వడంతో కొన్ని గంటల్లోనే ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. పాజిటివ్ కేసులు పెరగడానికి ఇదొక కారణంగా తెలిసింది.