దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం మాత్రమే ముఖ్యం కాదు.
ఇంట్లో ఆహార పదార్థాలను వినియోగించే సమయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ‘భారత ఆహార నాణ్యత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’ప్రజలకు సూచించింది.
కోవిడ్-19 వ్యాప్తి నివారించడానికి ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1) బయటి నుంచి తీసుకువచ్చిన పండ్లు మరియు కూరగాయలను మంచి నీటితో శుభ్రంగా కడగాలి.
2) మాంసాహారాలను బాగా ఉడికించి వండుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
3) ప్రతి రోజూ తరచుగా మంచినీటిని తాగడం అలవర్చుకోవాలి.
4) రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్-సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి.
5) మాంసం, కూరగాయలు, పండ్ల కోసం ఉపయోగించే కత్తులు, బోర్డులను వేర్వేరుగా వాడాలి.