కోవిడ్ పరీక్షలు చేయడంలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానం

మంగళవారం, 9 జూన్ 2020 (09:17 IST)
కోవిడ్-19 పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మొదట మన రాష్ట్రంలో కనీసం టెస్టింగ్ ల్యాబ్ లేని స్థితి నుంచి ఇప్పుడు దేశంలోనే లే  అత్యధికంగా కోవిడ్ పరీక్షలు చేసేస్థాయికి చేరింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 1వ తేదీన తొలి కోవిడ్ నమూనా శాంపిల్స్  సేకరించింది. ఈ కోవిడ్ నమూనా పరీక్ష ఫలితం కోసం పూణెలోని ల్యాబ్స్ కు పంపించడం జరిగింది. అప్పటి వరకు మన రాష్ట్రంలో కోవిడ్-19 నమూనాలను పరీక్షించడానికి ఎలాంటి ల్యాబ్స్ అందుబాటులో లేవు. 
 
అప్పటికే రాష్ట్రంలోని ప్రజలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నమూనాల సేకరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకోవడం మరియు కోవిడ్ పరీక్షలు చేయడానికి అవసరమైన ల్యాబ్స్ ఏర్పాటుపై దృష్టిసారించింది.   
 
మార్చి 10, 2020న  చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఙాన సంస్థ (స్విమ్స్)లో మొట్టమొదటి ప్రయోగశాలను ప్రారంభించడానికి ఐసిఎంఆర్ నుంచి అనుమతి లభించింది. అప్పటి నుంచి పరీక్షలు చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది.
 
తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, అనంతపురంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వీ.ఆర్.డి.ఎల్ & ట్రునాట్ పరీక్షల ల్యాబ్స్ కలిపి మొత్తం 68 ప్రయోగశాలలు ఉన్నాయి. 
 
ఈ ల్యాబ్స్ అన్నీ 24 గంటలు పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో జూన్ 6వ తేదీన 17,695 నమూనాలను పరీక్షించడం జరిగింది.  
 
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 7, 2020 వరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 4,68,276. ఈ నమూనాల్లో వీ.ఆర్.డి.ఎల్ మరియు ట్రునాట్ పరీక్షలు మాత్రమే ఉన్నాయి. 
 
ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సి.ఎల్.ఐ.ఎ & ఆర్.డి.కె పరీక్షలను కూడా చేస్తోంది. అయితే ఈ పరీక్షలు కేవలం స్క్రీనింగ్ కోసం మాత్రమే ఉపయోగించబడుతున్నాయి. ఇవి ప్రధాన పరీక్ష ఫలితాల్లో చూపించబడవు. 
 
జూన్ 8, 2020 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కోవిడ్ పరీక్షల సంఖ్య 4,68,276 కు చేరింది. ఇందులో 4813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 838 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా.. 132 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.
 
టెస్టింగ్ సామర్థ్యం పెంచుకోవడ మీ కాకుండా,  రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుతూ టెస్ట్ ఫలితాలను కోవిడ్ ఆస్పత్రుల తో అనుసంధానం చేసి ఇ ఎలాంటి జాప్యం లేకుండా, ప్రజలకు ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు కలగజేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు