తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,554 కొత్తగా వ్యాధి సోకిన వారిని గుర్తించారు. 43,916 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. మరోవైపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,435 మంది బాధితులు కోలుకున్నారు.
దీంతో రికవరీ రేటు 87 శాతానికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,19,224 మందికి వ్యాధి సోకిందని తేలింది. వీరిలో 1,256 ప్రాణాలు కోల్పోగా.. 1,94,653 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇంకా 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
19 వేలకు పైగా మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 37,46,963 శాంపిళ్లను వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీ 249, రంగారెడ్డి 128, మల్కాజ్‌గిరి 118, మిగితా జిల్లాల్లో వందలోపు కేసులు నమోదవుతున్నాయని హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
గతంలో హైదరాబాద్‌లోనే అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పాకేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌లో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. పల్లెటూర్లలో సైతం ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి.