ఒమిక్రాన్ గుబులు - మధ్యప్రదేశ్‌లో 8 - ఒరిస్సాలో 4 కొత్త కేసులు

ఆదివారం, 26 డిశెంబరు 2021 (17:53 IST)
మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కొత్తగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఆ రాష్ట్రంలో తొలిసారి ఏకంగా 8 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీరిలో ఎక్కువ మంది యువతే కావడం గమనార్హం. ఈ ఎనిమిది మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదివారం వెల్లడించారు. 
 
ఇలాగే, ఒరిస్సా రాష్ట్రంలోనూ నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరింది. ఈ నలుగురు కొత్త రోగుల్లో ఇద్దరు నైజీరియా నుంచి, మరో ఇద్దరు యూఏఈ నుంచి వచ్చినవారు ఉ్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఈ నెల 20వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఈయన ప్రకాశం జిల్లా వాసి. అలాగే, మరో వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ నెల 16వ తేదీన సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు అక్కడ నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ రెండు కేసులో కొత్తగా వెలుగు చూశాయి. దీంతో వీరిద్దరితో కాంటాక్ట్ అయిన సెకండరీ కాంటాక్ట్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే, అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 
 
422కు చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఇప్పటివరకు మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 422కు చేరింది. అలాగే, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,987కు చేరుకుంది. ఇదిలావుంటే, ఈ వైరస్ బారినపడి మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరింది. 
 
ఇకపోతే, ఈ వైరస్ నుంచి 7,091 మంది కోలుకున్నారు. మరో 162 మంది మృత్యువాతపడ్డారు. ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో 130 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 76,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, ఇప్పటివకు దేశంలో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,79,682కు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు