ఏపీలో తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు

మంగళవారం, 20 జులై 2021 (18:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కేసులు కొద్దిగా తగ్గుముఖంలోఉన్నాయి. అయితే, ఏపీలో సోమవారం విడుదల చేసిన రిపోర్టు మేరకు 1600 కొత్త కేసులు నమోదైనట్టు తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కానీ, మంగళవారం విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో కొత్తగా 2 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 
తాజా బులిటెన్ మేరకు 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వైరస్‌ బారినపడిన వారిలో 2,201 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,94,4222కు పెరిగాయి. ఇప్పటివరకు1,90,7201 కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 23,843 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,178కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 88,149 శాంపిళ్లను పరీరక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు