లాక్‌డౌన్ కారణంగా పనులు లేక, ఆదాయం లేక ఇబ్బందులు పడిన ఈ డబ్బావాలా బతుకులను నిసర్గ తుఫాను కూడా దెబ్బతీసింది. ఈ తుఫాను కారణంగా చాలామంది డబ్బావాలాల ఆహార నిల్వలు నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెమ్మదిగా మహారాష్ట్ర మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటోంది. ప్రాంతాలవారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. అయినాసరే తమ బతుకులు మాత్రం మారడం లేదని, తమ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోయిందని, 130ఏళ్లలో ఎప్పుడూ తాము ఇలాంటి కష్టాలు ఎదుర్కోలేదని డబ్బావాలాలు వాపోతున్నారు.