ఒకే ఒక్క డెల్టా వేరియంట్ కేసు: దేశాన్ని లాక్‌డౌన్‌లో పెట్టేసిన ప్రధాని

బుధవారం, 18 ఆగస్టు 2021 (09:57 IST)
కేవలం ఒకే ఒక్క డెల్టా వేరియంట్ కేసులు బయటపడ్డాయి ఆ దేశంలో. అంతే... ఏకంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు న్యూజీలాండ్ దేశ ప్రధానమంత్రి ఆర్డెర్న్. డెల్టా వేరియంట్ వ్యాప్తిని ఎదుర్కొంటున్నందున న్యూజిలాండ్ కఠినమైన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించినట్లు పేర్కొన్నారు.
 
పొరుగున వున్న న్యూ సౌత్ వేల్స్‌లో కేసులు 600 కంటే ఎక్కువ రికార్డు స్థాయికి చేరుకోవడం ఒకవైపు, న్యూజిలాండ్‌లో తొలుత ఆరు కోవిడ్ కేసులు గుర్తించబడ్డాయనీ, మంగళవారం ఒక వ్యక్తికి డెల్టా ఇన్‌ఫెక్షన్‌ బయటపడిందని ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ వెల్లింగ్టన్‌లో విలేకరులతో అన్నారు.
 
మరోవైపు న్యూ సౌత్ వేల్స్‌లో 633 కొత్త డెల్టా కేసులు నమోదు కావడంతో తాము ముందు జాగ్రత్తచర్యగా లాక్ డౌన్ ప్రకటించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ వుండటంతో న్యూజీలాండ్ అప్రమత్తమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు