భారత్‌లో రికవరీ రేటు 76.28 శాతంగా ఉందని చెప్పారు. మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 1.82 శాతంగా ఉందని వివరించారు. దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని ఆయన చెప్పారు. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి గురించి స్థానిక నాయకులందరూ అవగాహన కల్పించాలని ఆయన కోరారు.