ఎర్ర చీమల పచ్చడితో అన్ని ప్రయోజనాలా? కరోనాకు విరుగుడా?

శనివారం, 2 జనవరి 2021 (17:14 IST)
Red Ants Chutney
కరోనా కారణంగా దేశ ప్రజలు అప్రమత్తంగా వుంటారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్స్ పాటించడం వంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా కారణంగా కర్ఫ్యూలు కూడా విధిస్తున్నారు. వైద్యులు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంకా సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే గిరిజనులు తింటున్న ఎర్ర చీమల పచ్చడి కరోనాకు వినాశనం అవుతుందని తాజాగా తేలింది. 
 
ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లోని గిరిజన సోదరులు ఎప్పుడూ ఎర్రచీమల పచ్చడిని జలుబు లాంటి రోగాలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ పచ్చడిని త్వరలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సమర్థవంతమైన కరోనా వ్యతిరేక మందుగా ప్రకటించే అవకాశం లేకపోలేదు.

ఈ వార్తను విని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజమే. మలేరియా, డెంగ్యూ, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు వంటి వ్యాధులకు ఎర్ర చీమల పచ్చడిని ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుందని గిరిజనులు నమ్ముతున్నారు. ఈ కారణంగా, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతమైన ఔషధంగా ఈ పచ్చడిని చేర్చాలని ఇక్కడి గిరిజన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 
Red Ants Chutney
 
ఇకపోతే.. గిరిజన ప్రాంతంలో ఈ పచ్చడి పేరును చాప్డా పచ్చడి అని పిలుస్తారు. ఈ పచ్చడి కోసం డిమాండ్ కూడా స్థానికుల నుండి పెరిగింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో వారానికి జరిగే సంతలో పది రూపాయలకు ఎర్ర చీమల పచ్చడిని అమ్ముతారు. గిరిజన సోదరులు ఈ పచ్చడి అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తారని తెలిసింది. 
 
ఎర్ర చీమల పచ్చడి యొక్క ప్రయోజనాలు
ప్రోటీన్, జింక్, కాల్షియం, విటమిన్ బి -12 ఇది కలిగి ఉంటుంది.
జ్వరం, మలేరియా, కామెర్లు, న్యుమోనియా వంటి వ్యాధులు దీనితో నయమవుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు