కరోనాతో అల్లకల్లోలమైపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదికి దిమ్మదిరిగే సూచనలిచ్చారు. అయితే ఆ సూచనలు పరిశీలించిన బీజేపీవారు మాత్రం... ఆమె పొదుపు కోసం సలహాలిచ్చారో, బీజేపీ ప్రభుత్వ కట్టడికి సూచనలు చేశారోనని సణుక్కుంటున్నారు.
ప్రస్తుత చారిత్రాత్మక పార్లమెంటులోనే కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ ఖర్చును 30 శాతం తగ్గించుకోవాలని, కేంద్ర మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని తెలిపారు. పీఎం కేర్స్ నిధులను, పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని సూచించారు.
ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ధనం ఆదా అవుతుందని, ఈ డబ్బు ద్వారా కరోనా కట్టడి చర్యలకు ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి సలహాలు కోరిన నేపథ్యంలో సోనియా గాంధీ లేఖ రాశారు.