తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 2వేలకు పైగా..?

బుధవారం, 7 అక్టోబరు 2020 (10:40 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 2,154 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,04,748 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1189 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా కోలుకున్న వారు 2239 ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారు 1,77,008 ఉన్నారు. 
 
ఇక మొత్తం యక్టివ్‌ కేసులు 26,551 ఉండగా, హోమ్‌ ఐసోలేషన్‌లో 21,864 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. ఇక కోలుకున్న వారి రేటు రాష్ట్రంలో 86.45 శాతం ఉండగా, దేశంలో 84.9 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.
 
అలాగే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు.. జీహెచ్‌ఎంసీ 303, ఖమ్మం 121, మేడ్చల్‌ మల్కాజిగిరి 187, నల్గొండ 124, రంగారెడ్డి 205 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు