ఏపీలో కరోనావైరస్ దూకుడు కాస్త బ్రేక్, కొత్తగా 5,795 కేసులు, 33 మరణాలు

మంగళవారం, 6 అక్టోబరు 2020 (18:41 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగతూ ఉంది. ఏపీలో సాధారణ పరిస్థితి దిశగా పురోగతి కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా నెమ్మదిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33 మంది కరోనాతో మరణించారు.
 
ఇదిలా ఉండగా కొత్తగా 5,795 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 970, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 123 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,046 మంది కరరోనా నుంచి కోలుకున్నారు.
 
రాష్ట్ర మొత్తంలో చూడగా ఇప్పటివరకు ఏపీలో మొత్తం 7,29,307 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 50,776 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,052కి పెరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు