ఏపీలో ఒక్కరోజే కోవిడ్ కారణంగా 18 మంది చనిపోయారు. కిందటి రోజుతో(22) పోల్చుకుంటే మరణాల స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 13,042కు పెరిగాయి. కొత్తగా గుంటూరు జిల్లాలో నలుగురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావని, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరేసి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
కోవిడ్ బారి నుంచి కొత్తగా 3,034 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 18,87,236కు పెరిగాయి. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,710గా ఉంది. ఇప్పటిదాకా చేసిన టెస్టుల సంఖ్య 2,31,30,708గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒక్క జిల్లాలో కూడా 500ల సంఖ్య దాటలేదు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో 100 లోపే కేసులు నమోదవుతున్నాయి. రాయలసీమలో ఒక జిల్లా మాత్రం కరోనా ఫ్రీ దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 767 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో ముగ్గురు మరణించారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 6,33,146కి చేరగా, కరోనా వైరస్‌తో 3,738 మంది మరణించారు. రాష్ట్రంలో 10,064 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 6,19,344 యాక్టివ్ కేసులు ఉండగా, 24 గంటల్లో 848 మంది రికవరీ అయ్యారు.