మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. తాజాగా జాల్నా జిల్లాలోని ఒక ఆలయంలోని సిబ్బంది, ఆలయం వెలుపలు ఉన్నవారు మొత్తం 55 మందికి కరోనా సోకిందని తేలడంతో జిల్లా అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ జయదేవ్ వాడిలోని జాలీచాదేవి మందిరం ఉందని, అక్కడ పూజలు నిర్వహించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారని తెలిపారు. తాజాగా ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 55 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో ఆలయాన్ని మూసివేశామన్నారు. ఆలయం వెలుప బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆలయ రహదారిలో రాకపోకలు కూడా నిలిపివేశామని తెలిపారు. అలాగే గ్రామంలో ఆరోగ్య కార్యకర్తల బృందం పర్యటిస్తున్నదని, వారు అక్కడి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారన్నారు. ఈ ప్రాంతంలో ప్రతియేటా జరిగే మేళాను కూడా ఈసారి రద్దు చేశామని తెలిపారు.