కాగా, ఈ చిత్రం మొదటి వారాంతంలో అనగా 4 రోజులు ప్రపంచవ్యాప్తంగా రూ. 252 కోట్లు వసూలు చేసిందని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ చిత్రానికి అత్యధిక కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది, ఇది అతని బాక్సాఫీస్ స్టామినాను పునరుద్ఘాటించింది. మరో వైపు ఈ సినిమాకు ఫ్యామిలీస్ రావడం ప్రారంభిస్తే మరింతగా పెరిగే అవకాశముందని నిర్మాణ వర్గాలు తెలియజేస్తున్నాయి.