తగ్గిన కరోనా ఉధృతి - కొత్తగా 13 వేల కరోనా పాజిటివ్ కేసులు

మంగళవారం, 5 జులై 2022 (10:41 IST)
దేశంలో కరోనా ఉధృతి తగ్గింది. దేశంలో కొత్తగా 13 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 4.51 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,086 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో పాజిటివిటీ రేటు 2.90 శాతంగా నమోదైంది. 
 
సోమవారం 16 వేల కేసులు రాగా తాజాగా ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. క్రియాశీల కేసులు 1,14,475కి చేరాయి. సోమవారం 12,456 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.53 శాతానికి తగ్గిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.28 కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించారు. 
 
24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 198 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు