అదుపులోకి వస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి - తగ్గుతున్న కొత్త కేసులు

బుధవారం, 6 జులై 2022 (12:00 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత రెండు రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు మంగళవారం 4.54 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా బుధవారం ఈ సంఖ్య 16,159గా ఉంది. 
 
మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ కట్టడిలోనే ఉన్నప్పటికీ తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.56 శాతంగా నమోదైంది. 
 
అలాగే, 24 గంటల వ్యవధిలో 15,394 మంది కోలుకున్నారు. 28 మంది మరణించారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,15,212(0.26 శాతం)కి పెరిగాయి. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.29 కోట్ల మంది(98.53 శాతం) కోలుకున్నారు. 5.25 లక్షల మరణాలు సంభవించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు