ఏపీలో కొత్తగా కరోనా కేసులు ఇవే... 14 నుంచి కర్ఫ్యూ ఎత్తివేత

గురువారం, 12 ఆగస్టు 2021 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,757 సాంపిల్స్‌ని పరీక్షించగా 1,859 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా సోకినట్టు తేలింది. 
 
అలాగే కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, విశాఖపట్నంలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, గడచిన 24 గంటల్లో 1,575 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. అలాగే నేటి వరకు రాష్ట్రంలో 2,54,53,520 సాంపిల్స్‌ని పరీక్షించారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 8688 ఉండగా వుంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1988910, డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1956627, మొత్తం మరణాల సంఖ్య 13595గా వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు