కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలానికి తొలిసారి వచ్చిన ఆయనకు ఆలయం వద్ద పూర్ణ కుంభంతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.
ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్నారు. హోం మంత్రికి స్వాగతం పలికినవారిలో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్, బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు