విజృంభిస్తోన్న కరోనా: సర్కార్ కీలక నిర్ణయం.. ఆంక్షలు కఠినతరం

సోమవారం, 10 జనవరి 2022 (12:24 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా కోవిడ్ ఆంక్షల గడువును జనవరి 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.  
 
తెలంగాణలో ప్రస్తుతం అమలు అవుతోన్న కోవిడ్ ఆంక్షల ప్రకారం.. రాష్ట్రంలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌ నిర్వహించకూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో తప్పని సరి మాస్కు ధరించాలి. 
 
మాస్కు ధరించకుంటే రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై కూడా టీఎస్ సర్కార్ నిషేధం విధించింది. కోవిడ్‌ విజృంభణ దృష్ట్యా ఈ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు