పుదుచ్చేరిలో విద్యా సంస్థలు మూసివేత

సోమవారం, 10 జనవరి 2022 (11:13 IST)
రాష్ట్రహోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. దీంతో ఆ రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖామంత్రి నమశ్శివాయం వెల్లడించారు. 
 
తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు విద్యా సంస్థలు మూసివేయడం జరిగింది. అందువల్ల ఒకటి నుంచి 9వ తేదీ వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. 
 
అలాగే, ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పీటీ రుద్రగౌడ్ విడుదల చేసిన ప్రకటనలో.. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వెలువడుతున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ప్రైవేట్, ప్రభుత్వ సహాయ సంస్థలతో నిర్వహించే అన్ని పాఠశాలలు మూసివేయాల్సిందిగా ఆదేశిస్తున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు