గొడుగు వాడితే కరోనా దూరం? ఎలాగంటే?

శనివారం, 28 మార్చి 2020 (15:28 IST)
Umbrella
ఎండల్లో, వానల్లో గొడుగు వాడుతూ వుంటాం. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను నియంత్రించేందుకు మనం వాడే గొడుగు ఉపయోగపడుతుందట. ఈ మేరకు కరోనా నియంత్రణ సామాజిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం. 
 
అందుకే కరోనా దరిచేరకుండా కట్టడి చేయడానికి ప్రతీ వ్యక్తికి గొడుగు బాగా ఉపయోగపడుతుందని, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సామాజిక దూరానికి అనువైన సిద్ధాంతమని వైద్యులు చెప్తున్నారు. 
 
సామాజికదూరంలో భాగంగా 3 అడుగుల దూరాన్ని కచ్చితంగా పాటించాలి. అలాంటిది ప్రతీ ఒక్కరు గొడుగు వాడితే కచ్చితంగా ఒకరినుంచి మరొకరు కనీసం మీటరు దూరం పాటించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. 
 
గొడుగు వాడితే.. ఒకవేళ ఎదుటివారు తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లను ఆ గొడుగు అడ్డుకుంటుంది. బయటినుంచి ఇంటికి రాగానే.. ఆ గొడుగును అరగంట ఎండలో ఉంచి, శానిటైజర్‌తో శుభ్రపరచొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇంకా రైతుబజార్లలో, దుకాణాల దగ్గర ఇలా చేయొచ్చన్నారు. గొడుగుల వాడకం ద్వారా ఎండ నుంచి తప్పించుకోవడమే కాకుండా కరోనా నుంచి దూరంగా వుండవచ్చునని వైద్యులు సెలవిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు