చైనా, కొన్ని ఇతర దేశాలు గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులలో గణనీయమైన పెరుగుదలను చూశాయి, దీని వల్ల త్వరలో మరొక వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నాలుగో వేవ్ ప్రభావం దేశంపై ఎలా వుంటుందంటే.. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జూన్ నెలలో నాల్గవ కరోనా వేవ్ భారతదేశాన్ని తాకే అవకాశం ఉంది.
థర్డ్ వేవ్ ఎఫెక్ట్ భారత్‌పై పెద్దగా లేదు. భారతదేశంలో మూడో వేవ్ తీవ్రత రేటు తక్కువగా నమోదైంది. అందువల్ల రాబోయే నాలుగో కరోనా వేవ్ ప్రభావం తక్కువగా వుండవచ్చునని అంచనా మాత్రమే. కానీ ఏదిఏమైనా నాలుగో కోవిడ్ వేవ్‌కు భారత్ సిద్ధంగా ఉండాలని, తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.