గత నాలుగేళ్ళుగా వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఆసియా క్రికెట్ కప్ పోటీలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీలకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఆసియా కప్ టోర్నీ టీ20 ఫార్మెట్‌లో నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లతో పాటు మరో దేశం పాల్గొనాల్సివుంది. కాగా ఇప్పటివరకు మొత్తం 14 సార్లు ఈ టోర్నీని నిర్వహించగా ఏడుసార్లు భారత్ విజేతగా నిలించింది. అలాగే, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. 2021 జూన్‌లోనే ఆసియా కప్ టోర్నీని నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అది సాధ్యపడలేదు.