ఫ్లోరిడా అట్లాంటిక్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కరోనాను నిరోధించేందుకు వివిధ రకాలైన మాస్కులతో వివిధ స్థాయిలలో ప్రభావం ఉంటుంది. సాధారణంగా ప్రజలు ఉపయోగించే నాలుగు రకాల ఫేస్ మాస్క్‌లను ఉపయోగిస్తున్నారు.
రెండు పొరల వస్త్రంతో కుట్టిన మాస్కు, వాణిజ్య కోన్ మాస్క్, చేతి రుమాలును కట్టుకోవడం, చున్నీ లేదా శారీ లేదా పైపంచె లేదా కండువాతో ముఖాన్ని కప్పుకోవడం. వీటిని కట్టుకున్నప్పుడు ఎవరైనా గట్టిగా లేదా తుమ్ముతూ ఉంటే ఆయా వాటి ద్వారా రక్షణ ఏమాత్రం అన్నది పరిశోధకులు ప్రతిదాన్ని పరీక్షించారు.
2. కోన్ తరహా మాస్కులతో బిందువులు 8 అంగుళాలు ప్రయాణించాయి.
3. ఒక మడతతో చేతి రుమాలు ముఖానికి అడ్డుగా కట్టుకోవడం అత్యంత చెత్తదిగా తేలింది. ఇలా కట్టుకున్న కరోనా రోగి దగ్గినా, తుమ్మినా ఆ బిందువులు 1 అడుగు 3 అంగుళాలు ప్రయాణించాయి.
4. నాలగవది చున్నీ లేదా శారీ లేదా పైపంచె లేదా కండువాతో ముఖాన్ని కప్పుకోవడం, ఈ మాస్కులకు కనీసం రక్షణ లేదని తేలింది. రోగి దగ్గినా, తుమ్మినా అతడి నుంచి బిందువులు 3 అడుగులు ప్రయాణించాయి.