ప్రముఖ సినీ నటి, లోక్‌సభ సభ్యురాలు సుమలత కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇపుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొన్నారంటూ తనను చాలామంది మిత్రులు, ఇతరులు అడుగుతున్నారని సుమలత వెల్లడించారు.
కాగా, భర్త అంబరీష్ చనిపోయిన తర్వాత సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత లోక్‌సభలో ఆమె కర్నాటక రాష్ట్రంలోని మాండ్య స్థానం ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.