సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 24, 1998)న దుబాయ్ వేదికగా జరిగిన కొకకోలా షార్జ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ట్రై సిరీస్ ఫైనల్లో సచిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 131 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 134 పరుగులతో వీరవిహారం చేసిన మాస్టర్.. ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు.
సచిన్ పేరిట పలు రికార్డులు వున్నాయి. వన్డే క్రికెట్‌లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా, అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
1994లో అర్జున అవార్డు, 1999లో పద్మశ్రీ పురస్కారం, 1997లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం, 1997లో విస్డెన్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ పురస్కారం, 2008లో పద్మ విభూషణ్ పురస్కారం, 2010లో ఐసిసి క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు మాస్టర్ బ్లాస్టర్.