సచిన్ టెండూల్కర్‌ను కాటేసిన కరోనా

శనివారం, 27 మార్చి 2021 (11:03 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కరోనా వైరస్ కాటేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నిర్ధారించారు. తాజాగా చేయించుకున్న పరీక్షలో సచిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సచిన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
 
'కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాను. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో తాజాగా మరోసారి పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మా ఇంట్లో మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చింది. 
 
నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నాకు మద్దతుగా నిలుస్తున్న వైద్య సిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి' అని సచిన్ ట్వీట్ చేశాడు. 
 
కాగా సచిన్‌ ఇటీవలే రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో సచిన్‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

pic.twitter.com/dOlq7KkM3G

— Sachin Tendulkar (@sachin_rt) March 27, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు