క్యాన్సర్ సోకినా లెక్కచేయలేదు.. ఆరు సిక్సుల వీరుడు.. యువీ.. (video)

సోమవారం, 10 జూన్ 2019 (14:38 IST)
యువరాజ్ సింగ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. క్యాన్సర్ సోకినా.. ఆత్మవిశ్వాసంతో ఆ భయంకరమైన వ్యాధి నుంచి బయటపడి.. క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో తనకంటూ ఓ స్థానాన్ని కైవసం చేసుకుని.. యువతకు ఆదర్శంగా నిలిచిన యువీ.. 1981, డిసెంబర్ 12‌న ఛండీగర్‌లో పుట్టాడు. ఈ ప్రాంతం నుంచి టీమిండియాకు ఎంపికైన క్రికెటర్ కూడా ఇతనే. 
 
భారత మాజీ బౌలర్ మరియు పంజాబీ సినీ నటుడు అయిన యోగ్‌రాజ్ సింగ్ కుమారుడైన యువరాజ్ సింగ్ 2000 నుంచి వన్డే క్రికెట్ తెరంగేట్రం చేశాడు. 2003 నుంచి టెస్ట్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇతను ప్రస్తుతం 2007 ప్రపంచ కప్ క్రికెట్లో ఇంగ్లండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
 
అలాగే 2007 టీ-20 వరల్డ్ కప్‌లో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా, 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 
 
* టీ-20 పొట్టి క్రికెట్లో తక్కువ బంతుల్లో పన్నెండు అర్థ సెంచరీలు
* వన్డే ప్రపంచ కప్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్ అత్యుత్తమ రికార్డు.. 
* మొత్తం టోర్నీల్లో 300లపైగా పరుగులు వున్నాయి. 15 వికెట్లు కూడా యువీ ఖాతాలో వున్నాయి.  
* వన్డే ప్రపంచ కప్ క్రికెట్‌లో సచిన్ తర్వాత అధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందిన క్రికెటర్‌గా యువీ పేరిట రికార్డుంది. 
* వన్డేల్లో 26 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు  
* వరుసగా వన్డేల్లో 3 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు 
* భారత క్రికెట్‌లో ఫీల్డింగ్‌లో యువీ దిట్ట 
* ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ క్లిష్ట పిచ్‌ల్లో అలవోకగా బ్యాటింగ్ చేయగలిగే అద్భుత బ్యాట్స్‌మన్
* 1999లో అండర్ 19 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
* 2011 ప్రపంచ కప్ తరువాత యువీకి కాన్సర్ సోకింది. 
* అయితే ఆ వ్యాధికి చికిత్స తీసుకుని ఆత్మవిశ్వాసంతో మళ్లీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు