ప్రేమికులయిన ప్రియదర్శి, ఆనంది వైవాహిక జీవితంలోకి ప్రవేశించాక వారి లైఫ్ లో హెడ్ కానిస్టేబుల్ సుమ కనకాల ఎంట్రీ తో ప్రేమంటే చిత్రం టీజర్ చెబుతోంది. అసలు సుమ వారి లైఫ్ లోకి ఎందుకు వచ్చిందనేది ఆద్యంతం వినోదాత్మకంగా వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.
పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజు లాంచ్ చేశారు.
టీజర్‌లో కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాల మేళవింపు హిలేరియస్ గా చూపించారు. పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమకథ, వాస్తవ జీవితంలోని చిన్న చిన్న సమస్యలతో ఎలా మలుపులు తిరుగుతుందో ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశారు. ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించి, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలని అలరించేలా చూపించారు. సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా ఎంట్రీ ఇవ్వడంతో కథలో కొత్త మలుపు వస్తుంది. ఆమె పాత్ర హ్యుమర్ ని మరింత ఎలివేట్ చేసింది.
డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ ఈ చిత్రాన్ని సిట్యువేషనల్ హ్యుమర్, మనసుని హత్తుకునే ఎమోషన్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రేమంటే అనే టైటిల్‌కు తగ్గట్లుగానే, ప్రేమలోని కలలు, వాస్తవాల మధ్య తేడాను చూపిస్తూ టీజర్ ప్రేక్షకులను ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యింది. ప్రియదర్శి–ఆనంది జంట మధ్య కెమిస్ట్రీ సహజంగా, చూడముచ్చటగా వుంది. సుమ కనకాల ప్రజెన్స్ కట్టిపడేసింది. వెన్నెల కిషోర్ తన సిగ్నేచర్ టచ్‌తో నవ్వులు పంచారు.
సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి (గామీ చిత్రానికి గద్దర్ అవార్డు గ్రహీత) ఈ చిత్రానికి బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. “డ్రాగన్”కి సంగీతం అందించిన లియాన్ జేమ్స్ ఎనర్జిటిక్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఎడిటర్ రాఘవేంద్ర తిరున్, ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే, డైలాగ్ రైటర్స్ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందరూ తమ తమ విభాగాల్లో అద్భుతమైన పనితీరు కనబరిచారు.
“Thrill-U Prapthirasthu!” అనే ఫన్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ప్రేమంటే నవ్వులు, ప్రేమ, జీవితం అన్నింటినీ కలిపిన హిలేరియస్ చిత్రం కానుంది. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రియదర్శి మాట్లాడుతూ.. నా వెనుక ఉండి ముందు నడిపిస్తున్న మా టీమ్ అందరికీ థాంక్యు. ఈ సినిమాని చాలా ప్రేమతో చేసాం. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. అందరిని థియేటర్స్ లో కలుద్దాం అనుకుంటున్నాను. నవంబర్ 21 గుర్తుపెట్టుకోండి. District app ని అందరూ డౌన్లోడ్ చేసుకుని ఈ సినిమాకి ఒక టికెట్ కొని ఒక టికెట్ ఉచితంగా పొందండి. అందరు కూడా సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి.
సుమ కనకాల మాట్లాడుతూ.. దర్శి చాలా నేచురల్ యాక్టర్. చాలా అద్భుతంగా నటించారు. ఇందులో ఆనంది దర్శి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. నవనీత్ మంచి స్క్రిప్ట్ తో వచ్చారు. ఇందులో లియాన్ జేమ్స్ గారి మ్యూజిక్ సింప్లి సూపర్. ఇందులో నాకు ఒక పాట ఉంది. దానికి ఒక హుక్ స్టెప్ ఉంది, నవంబర్ 21న తప్పకుండా అందరూ సినిమా థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను
హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. మంచి రొమాంటిక్ కామెడీతో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రియదర్శి గారికి సుమా గారికి మా డైరెక్టర్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇందులో దర్శి గారు చాలా కొత్తగా కనిపిస్తారు. తప్పకుండా అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఫ్యామిలీతో కలిసి రండి చాలా ఎంజాయ్ చేస్తారు.