నేడు చివరి వన్డే మ్యాచ్ : బౌలింగ్ ఎంచుకున్న భారత్

ఆదివారం, 23 జనవరి 2022 (14:28 IST)
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం కేప్‌టౌన్ వేదికగా నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ కీలకంగా మారింది. 
 
ఈ మ్యాచ్‌లో గెలుపొంది పరువు దక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది. సూర్య కుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్‌లకు అవకాశం ఇచ్చింది. సౌతాఫ్రికా కూడా ఓ మార్పు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు