రెండో వన్డే మ్యాచ్ : సఫారీ జట్టు టార్గెట్ 288 రన్స్

శుక్రవారం, 21 జనవరి 2022 (18:19 IST)
ఆతిథ్య సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా ముంగిట 288 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. 
 
తొలి వన్డే జరిగిన పార్ల్ స్టేడియంలోనే శుక్రవారం రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లలో రిషబ్ పంత్ 85, రాహుల్ 55 చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అత్యధికంగా 179 రన్స్ జోడించారు. చివరలో శార్దూల్ ఠాకూర్ అదిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 
 
శార్దూల్, అశ్విన్‌లు కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 48 రన్స్ చేశారు. అలాగే, ధవాన్ 29, శ్రేయాస్ అయ్యర్ 11, వెంకటేష్ అయ్యర్ 22 చొప్పున పరుగుల చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 20 రన్స్ వచ్చాయి. సౌతాఫ్రికా బౌలర్లలో షంషీ రెండు వికెట్లు తీశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు