దివ్యాన్ష్ సింగ్ మాట్లాడుతూ, "మొదట కోచ్‌ల సంతోషానికి అవధుల్లేవ్. పోటీలో బంగారు పతకం సాధించామని తెలియగానే ఊహించని ఆనందం కలిగింది. ఇతర వ్యక్తిగత పతకాలు సాధించినప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ ఆ ఆనందాన్ని అనుభవించలేదు. మన జాతీయ గీతాన్ని వినిపించినప్పుడు నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను." అంటూ తెలిపాడు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ మొత్తం 228.8 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ముఖ్యంగా, అతను షూటింగ్ పోటీలో తన సహచరుడు రుద్రాంశ్ పాటిల్‌ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. పాటిల్ 208.7 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు.