అమర జవాన్ల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళం

ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (16:19 IST)
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీసీఐ) రూ.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉగ్ర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, వ్యాపార సంస్థలు తమకు వీలైనంత ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. 
 
ఈ క్రమంలో భాగంగా, తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ)కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా విజ్ఞప్తి కూడా చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు కనీసం రూ.5 కోట్లు సాయం ప్రకటించాలని పరిపాలనా కమిటీని కోరారు. భారత క్రికెట్ బోర్డు పాలనా వ్యవహారాలను సీవోఏ పర్యవేక్షిస్తోన్న విషయం తెలిసిందే. ఆర్థిక సాయంపై క‌మిటీ తుది నిర్ణ‌యం తీసుకోనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు