ఆఫ్ స్టంప్ కు ఆవల పడిన బంతులను కోహ్లీ వేటాడడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఐదు, ఆరు, ఏడో స్టంప్ ల దగ్గర పడిన బంతులకు కోహ్లీ ఔట్ కావడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమన్నారు. 2014లో అతడు అలాగే ఆఫ్ సైడ్ స్టంప్‌ల మీద పడిన బంతులకే ఎక్కువ సార్లు అవుటైన విషయాన్ని గుర్తు చేశారు.
కాగా, 2004 సిడ్నీ టెస్టులో సచిన్ టెండూల్కర్ 241 పరుగులతో అజేయంగా నిలిచాడు. 613 నిమిషాల పాటు క్రీజులో నిలిచిన లిటిల్ మాస్టర్.. ఒక్కసారి కూడా కవర్ డ్రైవ్ ఆడలేదు. సచిన్ ఇన్నింగ్స్ తో భారత్ 705/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సొంతగడ్డపై ఆడుతున్న ఆస్ట్రేలియా మ్యాచ్ ను డ్రా చేసుకుంది.