హార్దిక్ పాండ్యా నీకు అంత పనికిరాదు.. షమీపై అరవడం అవసరమా?

మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (15:54 IST)
ఐపీఎల్‌-2022లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ ఆడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాండ్యా బృందం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. 
 
ముఖ్యంగా విలియమ్సన్‌ గుజరాత్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్‌ త్రిపాఠి సైతం విలియమ్సన్‌కు తోడుగా నిలబడ్డాడు.
 
ఈ క్రమంలో 13వ ఓవర్‌లో స్వయంగా రంగంలోకి దిగిన హార్దిక్‌ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఓవర్‌ రెండు, మూడో బంతుల్లో విలియమ్సన్‌ వరుస సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌కు వరుసగా రెండు, ఒక పరుగు వచ్చాయి. ఈ క్రమంలో స్ట్రైక్‌ తీసుకున్న త్రిపాఠి అప్పర్‌ కట్‌ షాట్‌ ఆడాడు. అది కాస్త డీప్‌ థర్డ్‌ మ్యాన్‌ దిశగా బంతి దూసుకుపోయింది.
 
అయితే, అక్కడే ఉన్న మహ్మద్‌ షమీ క్యాచ్‌ అందుకోవడంలో విఫలమయ్యాడు. షమీ క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో హార్దిక్‌ పాండ్యా సహనం కోల్పోయాడు. అతడి మీదకు అరుస్తూ అసహనం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ క్రమంలో హార్దిక్‌ను ఉద్దేశించి.. ''సన్‌రైజర్స్‌ జట్టులో అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి వంటి వాళ్లు క్యాచ్‌లు వదిలేశారు. అయినా కేన్‌ విలియమ్సన్‌ సంయమనం పాటించాడు.
 
కానీ నువ్వు.. టీమిండియాలో సీనియర్‌ అయిన షమీ మీదకు అరుస్తావా? కెప్టెన్‌ అయ్యానని అహంకారమా? అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కెప్టెన్ అనే అహం పనికి రాదంటూ ఫైర్ అవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు