మోతేరా టెస్ట్ మ్యాచ్ : నాలుగో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్

గురువారం, 4 మార్చి 2021 (09:47 IST)
మోతేరా కేంద్రంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది.
 
ఈ పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలిస్తుందన్న వార్తలు ముందుగానే వచ్చిన నేపథ్యంలో, తొలుత బ్యాటింగ్ అడ్వాంటేజ్‌ని వినియోగించుకోవాలని ఇరు జట్లూ భావించగా, ఆ అవకాశం ఇంగ్లండ్‌కు దక్కింది.
 
ఈ పిచ్ తొలుత బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని, ఆపై స్పిన్‌కు సహకరిస్తుందన్న అంచనాతోనే తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్నట్టు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ తెలుపగా, ఇంచుమించు తనది కూడా అదే అభిప్రాయమని కోహ్లీ చెప్పాడు. 
 
ఈ మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ ను తుది జట్టుకు ఎంపిక చేసినట్టు తెలిపాడు. తమ స్పిన్నర్లు ఇంగ్లండ్‌ను కట్టడి చేయగలరనే భావిస్తున్నట్టు వ్యాఖ్యానించాడు.
 
ఇరు జట్ల వివరాలు... 
భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, పుజార, కోహ్లీ (కెప్టెన్‌), రహానే, పంత్‌, అశ్విన్‌, సుందర్‌, అక్షర్‌, ఇషాంత్‌, సిరాజ్‌
ఇంగ్లండ్‌: క్రాలీ, సిబ్లే, బెయిర్‌స్టో, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, బెస్‌, లారెన్స్‌, లీచ్‌, అండర్సన్‌  
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు