అయితే, ఆప్ఘనిస్థాన్‌కు తక్కవుగా అంచనా వేయడానికి లేదు. ఇప్పటివరకు ఒక్క విజయం సాధించని టీమ్ఇండియా ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..? అనే సందేహం రావడం సహజం. అయితే.. అవకాశాలు కాస్త ఉన్నాయనే చెప్పాలి. కానీ ఆచరణలో మాత్రం అది అంత తేలికైన విషయం కాదు. మరి అవేంటో ఓసారి చూద్దాం..
ఆప్ఘన్ చేతిలో పాక్ ఓడిపోవాలి..
బుధవారం ఆప్ఘన్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ చేతిలో పాక్ ఓడిపోవాలి. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే మాత్రం భారత్ తట్టాబుట్టా సర్దుకుని ఇండియా ఫ్లైట్ ఎక్కాల్సివుంటుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఒక విజయంతో ముందడుగు వేసింది. అదీనూ టీమ్ఇండియాపైనే గెలిచింది.
ఒక వేళ ఏదేని అనివార్య కారణాల రీత్యా మ్యాచ్ రద్దైనప్పటికీ పాక్ మూడు పాయింట్లు సాధించి ముందడుగు వేస్తుంది. కాబట్టి బుధవారం మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో పాక్ ఖచ్చితంగా ఓడాలి. అయితే పాక్ ఫామ్‌ను చూస్తే కష్టమేనని చెప్పాలి. అటు ఆప్ఘన్ కూడా తక్కువేమీ కాదు. లంకపై తృటిలో ఓటమిపాలైంది కానీ గ్రూప్ స్టేజ్‌లో ఆప్ఘన్ అదరగొట్టేసి మరీ సూపర్-4లోకి అడుగుపెట్టింది.
భారత్ చేతిలో ఆప్ఘన్ ఓడిపోవాలి..
గురువారం ఆప్ఘన్‌తో భారత్ మ్యాచ్ ఆడాల్సివుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో పాక్ గెలిస్తే మాత్రం భారత్ మ్యాచ్ నామమాత్రంగా మారుతుంది. ఒకవేళ పాక్ ఓడితే మాత్రం భారత్‌కు అద్భుత అవకాశం వచ్చినట్లే. ఆప్ఘన్ మీద మంచి విజయంతో భారీగా నెట్‌రన్‌రేట్‌ను సాధిస్తే ఫైనల్ రేసులో నిలుస్తుంది.