డిప్యూటీ సీఎం అయినా ఫ్రెండ్‌గా, గైడ్‌లా మాట్లాడారు.. హనుమ విహారి

సెల్వి

శనివారం, 29 జూన్ 2024 (14:10 IST)
క్రికెటర్ హనుమ విహారి రాబోయే దేశవాళీ సీజన్‌లో ఆంధ్రా తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. 30 ఏళ్ల అతను జట్టు కెప్టెన్‌గా బలవంతంగా వైదొలగడంతో తన 'ఆత్మగౌరవం' కోల్పోయినందున ఆంధ్రాతో సంబంధాలను తెంచుకుంటానని ఫిబ్రవరిలో ప్రకటించాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ మేరకు మళ్లీ ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడాలని నిర్ణయించుకున్నట్లు హనుమ విహారి స్పష్టం చేశారు. జట్టును ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పాడు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవడంపై హనుమ విహారి మాట్లాడుతూ.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)తో ఎలాంటి ఇబ్బంది ఉండదని.. మా జట్టును అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లాలని హనుమ విహారి చెప్పారు. గత ప్రభుత్వం తన ప్రతిభను తుంగలో తొక్కింది. ఆ కష్టాలను పవన్ కల్యాణ్ గారికి వివరించారు. ఈ సందర్భంగా ఎలాంటి హంగులు లేకుండా సౌమ్యంగా పవన్ తనతో మాట్లాడారని చెప్పారు. మన మనిషిలా, చాలా ఫ్రెండ్లీగా పవన్ మాట్లాడారని కొనియాడారు. 
 
డిప్యూటీ ఛీప్ మినిస్టర్‌గా కాకుండా ఫ్రెండ్, గైడ్‌గా మాట్లాడారని.. పవన్ ఫ్యాన్ అని.. ఒకవేళ ఫ్యాన్ గా వుండి వుంటే ఆయన్ని కలిసేవాడిని కాదని.. దూరంగా వుండి సపోర్ట్ చేసేవాడనని.. అయితే డిప్యూటీ సీఎంగా ఆయన్ని కలవాల్సి వచ్చిందని హనుమ విహారి తెలిపారు. 

Indian Cricketer @Hanumavihari about our Dy CM @PawanKalyan ???? pic.twitter.com/USN5vy8K0D

— Narendra G (@Narendra4News) June 28, 2024
 
ఇక ఎలాంటి సమస్య ఎదురైనా తనను కలమని డిప్యూటీ సీఎం హోదాలో వున్న పవన్ గారు చెప్పడం చాలా గ్రేట్ అన్నారు. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మళ్ళీ నిలదొక్కుకునేలా కూటమి సర్కారులోని పెద్దలు చేసారని హనుమ విహారి వెల్లడించారు.  
 
మితిమీరిన రాజకీయ జోక్యంతో అవమానకర పరిస్థితుల్లో ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న తనను కూటమి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గౌరవంతో స్వాగతించిందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు