ప్రపంచ కప్ ఫైనల్లో హార్ధిక్ పాండ్యా విలువ తెలిసొచ్చింది..

సోమవారం, 20 నవంబరు 2023 (12:37 IST)
ముగిసిన ప్రపంచ కప్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విలువ తెలిసివచ్చిందన్నారు. అటు బ్యాటు, ఇటు బంతితో రాణించగల ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ ఆటగాడు జట్టుకు తెచ్చే విలువే వేరు. బ్యాటింగ్లో కష్టాల్లో పడితే ఆదుకుంటాడు. బౌలింగులో పూర్తి కోటా వేయగల సమర్థుడు. ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతను బంతితో రాణించాడు.
 
లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడి టోర్నీకి దూరమైనా భారత్ పెద్దగా కంగారు పడలేదు. హార్దిక్‌లేని లోటును భర్తీ చేసే క్రమంలో శార్దూల్‌ను తప్పించి షమిని ఆడించడం గొప్పగా కలిసొచ్చింది. బ్యాటింగులో సూర్యకుమార్ మీద పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది. దీంతో హార్దిక్ లేని లోటు గురించి ఆలోచనే లేదు. 
 
కానీ ఫైనల్లో మాత్రం హార్దిక్‌లేని లోటు స్పష్టంగా కనిపించింది. సూర్య కుమార్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. హార్దిక్ ఉంటే.. జడేజా కంటే ముందే అతను క్రీజులోకి వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడేవాడేమో. ఇక బౌలింగ్ హార్దిక్ అందుబాటులో ఉంటే.. ఆరో బౌలర్‌గా ఉపయోగపడేవాడు. సిరాజ్‌తో పాటు స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోతున్నపుడు కెప్టెన్ అతడి వైపు చూసేవాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు