ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ – ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఒకరిలా మనం అనుకరించడం కాదు, మనకు తగిన స్టయిల్ లో మనం ఉండాలి. ఆధునిక టెక్నాలజీతో నాణ్యమైన హెల్త్ కేర్ సేవలు అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్ నిర్వాహకులకు అభినందనలు. అందరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటాం. అలాంటి ఆహ్లాదకరమైన, విశ్వసనీయమైన సేవలను విజయవాడ ప్రజలకు అందించడానికి ఈ సంస్థ ముందుకు రావడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
కలర్స్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ –2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ ఇప్పటివరకు వేలాది మంది కస్టమర్లను సంతృప్తి పరిచింది. ఈ నేపథ్యంలో 'కలర్స్ హెల్త్ కేర్'ను దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇప్పుడు విజయవాడలో కూడా బ్రాంచ్‌ను ప్రారంభించాము. అత్యాధునిక టెక్నాలజీని నిరంతరం జోడిస్తూ సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం అని తెలిపారు.
డైరెక్టర్ అఫ్ ఆపరేషన్స్ కృష్ణ రాజ్ మాట్లాడుతూ – 21 సంవత్సరాల నుంచి Kolors Healthcare ద్వారా సేవలను పొందిన కస్టమర్ల సంతృప్తి మాకు ఎంతో మద్దతుగా నిలిచింది. వారి అభిలాష మేరకు విజయవాడలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించాం. యుఎస్-ఎఫ్డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో కలర్స్ హెల్త్ కేర్ 2.O కూడా ను అందుబాటులోకి తెచ్చాం. అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు ప్రపంచ స్థాయి ట్రీట్మెంట్‌ను అందిస్తున్నాం అని వివరించారు.
ఈ ఈవెంట్ ను 5M మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించగా, హీరోయిన్ సంయుక్త మీనాన్ ను చూసేందుకు విజయవాడ సందడిగా మారింది. ఈ వేడుకలో పాల్గొన్న పలువురు అతిథులు కలర్స్ హెల్త్ కేర్ నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.