ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : సెమీస్‌లో భారత్ - మిగిలిన జట్ల పరిస్థితి ఏంటి?

సోమవారం, 6 నవంబరు 2023 (11:36 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ విజయంతో భారత్ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో గెలుపొందింది. తద్వారా మొత్తం 16 పాయింట్లను తన ఖాతాలో వేసుకుని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదేసమయంలో ఈ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలవడమేకాకుండా, అగ్రస్థానాన్ని నిలబెట్టింది. 
 
టోర్నీ లీగ్ దశ ముగింపునకు చేరుకోవడంతో ఇతర ఏ జట్టుకైనా నంబర్ వన్ స్థానానికి చేరుకునే అవకాశం?.. అంటే ఏమాత్రం అవకాశం కనిపించడం లేదు. దక్షిణాఫ్రికాపై గెలుపుతో అగ్రస్థానాన్ని భారత్ పదిలం చేసుకుంది. టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో  నెదర్లాండ్స్‌తో తలపడనుంది. 
 
ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి చివరి మ్యాచ్ ఓడిపోయినా భారత్ ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. టోర్నీలోని ఇతర ఏ జట్టూ 16 పాయింట్లు సాధించే అవకాశం కనిపించడం లేదు. సెమీఫైనలు అర్హత సాధించి రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు కూడా ఆ ఛాన్స్ లేదు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఉంది. చివరి మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి. 
 
మరోవైపు ఆస్ట్రేలియాకు మిగిలిన 2 మ్యాచ్ గెలిచినా ఆ జట్టు వద్ద కూడా 14 పాయింట్లే ఉంటాయి. కాబట్టి టీమిండియా అగ్రస్థానానికి ఎలాంటి డోకా లేదు. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో సెమీ-ఫైనల్ పోరులో తలపడడం ఖాయంగా కనిపిస్తోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు