వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టు ఎంపిక - కోహ్లీకి దక్కని చోటు

గురువారం, 14 జులై 2022 (16:24 IST)
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళనుంది. ఈ పర్యటన కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రకటించింది. ఇందులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్థానం కల్పించలేదు. 
 
ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు కోహ్లీ దూరమయ్యాడు. ఇపుడు రెండో వన్డేలో కూడా ఆడటం అనుమానమేనని అంటున్నారు. ఈ క్రమంలో విండీస్‌తో టీ20 సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపత్యంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్‌ వైస్ కెప్టెన్‌గా 18 మంది సభ్యులతో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. 
 
జులై 22 నుంచి విండీస్‌ పర్యటనను భారత్‌ ప్రారంభిస్తుంది. తొలుత మూడు వన్డేల సిరీస్‌లో విండీస్‌తో తలపడనుంది. జులై 29 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. టీ20 సిరీస్‌కు జట్టులోకి సీనియర్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్‌లకు స్థానం కల్పించగా.. ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం దక్కలేదు. 
 
విండీస్ పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టు ఇదే... 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఆర్.అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీవ్ సింగ్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు